Dindi: రాజ్యాంగ దినోత్సవం రోజున ఓటేసిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!

Dindi: భారత రాజ్యాంగ దినోత్సవం రోజున మలికిపురం మండలం దిండి గ్రామ పోలింగ్ కేంద్రంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

PRABHU, RAZOLE
Published on: 26 Nov 2026 2:21 PM IST
Dindi
X

Dindi: రాజ్యాంగ దినోత్సవం రోజున ఓటేసిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!

దిండి: భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26వ తేదీన గ్రామపంచాయతీల తొలి విడత ఎన్నికలు నిర్వహించడం విశేషమని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత బలాన్నిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మలికిపురం మండలం దిండి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని, గ్రామాల అభివృద్ధికి, సమర్థవంతమైన స్థానిక పాలనకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో చురుకుగా పాల్గొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE