Mamidikuduru: జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన లాహితీ తేజ!
Mamidikuduru: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడకు చెందిన లాహితీ తేజ జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించింది.
Mamidikuduru: జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన లాహితీ తేజ!
Mamidikuduru: జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామానికి చెందిన జి. లాహితీ తేజ ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ఆమె పాల్గొని అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించింది.
లాహితీ తేజ గెద్దాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. అంబాజీపేట తైక్వాండో క్లబ్‌లో శిక్షణ పొందుతూ పోటీలకు సిద్ధమవుతోంది. చిన్న వయసులోనే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, శిక్షకులు హర్షం వ్యక్తం చేశారు.
లాహితీ తేజ తండ్రి గుబ్బల నాగార్జున మలికిపురం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. లాహితీ తేజ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.




