Kothapeta: కొత్తపేట సర్పంచ్ అభ్యర్థిగా యల్లమెల్లి సందీప్ నామినేషన్!
Kothapeta: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామ సర్పంచ్ పదవికి కూటమి టీడీపీ అభ్యర్థిగా యల్లమెల్లి సందీప్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
Kothapeta: కొత్తపేట సర్పంచ్ అభ్యర్థిగా యల్లమెల్లి సందీప్ నామినేషన్!
కొత్తపేట: కూటమి టీడీపీ అభ్యర్థిగా కొత్తపేట గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న యల్లమెల్లి జగన్మోహన్ తనయుడు సందీప్ ఈరోజు కొత్తపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి దంపతులు యల్లమెల్లి సందీప్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.




