Kothapeta: కొత్తపేటలో తెలుగుదేశం పార్టీలో చేరిన ముస్లిం సోదరులు!
Kothapeta: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు వాడపాలెం కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో టీడీపీలో చేరారు.
Kothapeta: కొత్తపేటలో తెలుగుదేశం పార్టీలో చేరిన ముస్లిం సోదరులు!
కొత్తపేట: బీసీ లకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీలో వెనుకబడిన వర్గాల ఆదరణ రోజురోజుకూ మరింతగా పెరుగుతుంది. ఈ మేరకు కొత్తపేట గ్రామానికి చెందిన షేక్ కాజబాబు,షేక్ బడేమియా,షేక్ హైదర్,షేక్ మహమ్మద్ఇంషిజ,సయ్యద్ గౌస్, మహమ్మద్ మాజ్ ముస్లిం సోదరులు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు.
వీరికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.




