Amalapuram: యెంట్రుకోనలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఇల్లు!

Amalapuram: కోనసీమ జిల్లా అల్లవరం యెంట్రుకోనలో ఉదయం అగ్నిప్రమాదంతో ఇల్లు దగ్ధమై రూ.2 లక్షల నష్టం జరిగింది. మంటల్లో ఉన్న మహిళను స్థానికులు కాపాడారు.

SURESH, AMALAPURAM
Published on: 6 Aug 2026 10:02 AM IST
Amalapuram
X

Amalapuram: యెంట్రుకోనలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఇల్లు!

అంబేద్కర్ కోనసీమ జిల్లా

అమలాపురం నియోజకవర్గం.

అల్లవరం మండలం యెంట్రుకోన గ్రామంలో అగ్నిప్రమాదం దగ్ధమైన ఇల్లు, సుమారుగా రూ.2 లక్షల ఆస్తి నష్టం.

అల్లవరం మండలం యెంట్రుకోన గ్రామంలోని తిక్కిరెడ్డి వారి వీధిలో ఈ రోజు ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.ఇంట్లో ఉన్న నగదు,గృహోపకరణాలు,ఇతర విలువైన సామాన్లు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి.ఈ ఘటనలో సుమారుగా రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆ ఇంట్లో ఉన్న లక్ష్మీ మంటల్లో చిక్కుకుంది. దీనిని గమనించిన పక్కింటి వారు వెంటనే ధైర్యంగా స్పందించి ఆమెను ఇంటి నుంచి బయటకు లాగి ప్రాణాలు కాపాడారు.దీంతో ఆమె స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడింది.స్థానికుల సమాచారం మేరకు మంటలు చెలరేగడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.ఈ ప్రమాదంతో బాధిత కుటుంబం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు మరియు దాతలు తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story