Amalapuram: కోనసీమ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు!

Amalapuram: కోనసీమ: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన కలెక్టర్.

SURESH, AMALAPURAM
Published on: 24 Sept 2026 11:54 AM IST
Amalapuram
X

Amalapuram: కోనసీమ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు!

Amalapuram: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రభావంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా విద్యార్థుల భద్రతను విస్మరించకూడదనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఆదేశాల మేరకు నేడు (24.09.2026) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలలకు విద్యాశాఖ ఒక రోజు కాంపెన్సేటరీ సెలవు ప్రకటించింది.

ఈ విపత్తు సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డి.ఇ.ఓ) మహబూబ్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అందరు ఉప విద్యాశాఖ అధికారులు,మండల విద్యాశాఖాధికారులు మరియు అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని,నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు నిర్వహిస్తే సదరు యాజమాన్యాలపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM