Mamidikuduru: మామిడికుదురు హాస్టళ్లలో ప్రత్యేక ఆరోగ్య, పారిశుధ్య తనిఖీలు!

Mamidikuduru: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మామిడికుదురు హాస్టళ్లలో ప్రత్యేక ఆరోగ్య, పారిశుధ్య తనిఖీలు. విద్యార్థులకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ.

PRABHU, RAZOLE
Published on: 9 Nov 2026 2:13 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: మామిడికుదురు హాస్టళ్లలో ప్రత్యేక ఆరోగ్య, పారిశుధ్య తనిఖీలు!

Mamidikuduru: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తుఫాను అనంతరం జిల్లాలోని మా మామిడికుదురు లో హాస్టళ్లను సందర్శించి ప్రత్యేక ఆరోగ్య, పారిశుధ్య తనిఖీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా రక్తహీనత (అనీమియా), కంటి, చెవి సంబంధిత సమస్యలు, దంత సమస్యలు, చర్మ వ్యాధులు తదితర ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులకు అవసరమైన మందులు అందజేశారు. విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై తగిన సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు.

అదేవిధంగా హాస్టళ్లలో తాగునీటి నాణ్యత, విద్యార్థుల వసతి గదులు, కాంపౌండ్ వాల్ పరిధిలోని పరిసరాల పరిశుభ్రత, వంటగదులు, మరుగుదొడ్ల పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా హాస్టల్ సిబ్బందికి తగిన సూచనలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. I. John Levi, సూపర్‌వైజర్ B. Narasimha Rao, MLHPలు P. నాగ దుర్గ, R. సుమ, MPHA (M) K.V. Srinivasa Rao, ANM M. జయ కుమారి, ASHA కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు హాస్టళ్లలో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వైద్య ఆరోగ్య సిబ్బంది తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE