Konaseema: భూ రీ-సర్వే గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ మహేష్ కుమార్
Konaseema: కోనసీమ జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, ధ్రువీకరణ పూర్తయిన 24 గంటల్లోగా వెబ్‌ల్యాండ్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Konaseema: భూ రీ-సర్వే గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ మహేష్ కుమార్
Ambedkar Konaseema: జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ప్రజలకు భూ సంబంధిత సేవలను పారదర్శకంగా, సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్,రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.విజయలక్ష్మి (సీసీఎల్‌ఏ)ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు,రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూ రీ-సర్వే పురోగతి, రెవెన్యూ సేవలు,పెండింగ్ ఫైళ్ల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీ-సర్వేలో పెండింగ్‌లో ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి,గ్రామాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు.రీ-సర్వే ధ్రువీకరణ పూర్తయిన 24 గంటల్లోగా వెబ్‌ల్యాండ్ పోర్టల్‌లో డేటాను అప్‌లోడ్ చేయాలని,డ్రాఫ్ట్ ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
డీఎల్‌ఆర్ దశలోని గ్రామాలపై ప్రత్యేక దృష్టి నవంబర్ నెలకు సంబంధించి డీఎల్‌ఆర్ దశలో ఉన్న గ్రామాల ప్రక్రియను రాబోయే 15 నుంచి 20 రోజుల్లోగా పూర్తి చేసి పోర్టింగ్ దశకు తీసుకురావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గ్రామాల్లో డ్రాఫ్ట్ ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను 80 శాతానికి పైగా పూర్తి చేయాలని సూచించారు.రాబోయే నెలల్లో పట్టాల పంపిణీకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు ప్రణాళికతో రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.సాంకేతిక, న్యాయపరమైన సమస్యలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
పనితీరు మందకొడిగా ఉన్న మండలాలపై రోజువారీ సమీక్ష రీ-సర్వే, రెవెన్యూ సేవల్లో పనితీరు మందకొడిగా ఉన్న మండలాల తహశీల్దార్లు,సంబంధిత ఆర్డీవోలతో కలెక్టర్లు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం 15 నిమిషాల పాటు సమీక్ష నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. మండలాల వారీగా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని, క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.22-ఏ కేసులను గడువులోగా పరిష్కరించాలి.
సెక్షన్ 22-ఏకు సంబంధించిన భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి,క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. నమోదైన దరఖాస్తులను 45 నుంచి 60 రోజుల కాలపరిమితిలోగా పరిష్కరించాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 22-ఏ కేసులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ఆధారంగా త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.భూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నాణ్యతకు ప్రాధాన్యం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందే అర్జీలను ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించాలని ఉన్నతాధికారులు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి,క్షేత్రస్థాయిలో అవసరమైన విచారణ చేపట్టి సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని తెలిపారు.
నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించి ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలే లక్ష్యం భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు.
ప్రజలకు భూ హక్కులపై స్పష్టత కల్పించడం, పట్టాల పంపిణీకి ఆటంకాలు లేకుండా చూడడం,భూ సమస్యలను సకాలంలో పరిష్కరించడం లక్ష్యంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ వై.ఖోమ్. నైడియా దేవి,జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు, జిల్లా పరిపాలన శాఖ అధికారి కే నాగలక్ష్మమ్మ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




