Razole: రాజోలు ఎంపీపీగా దొండపాటి కృష్ణవేణి ఎన్నిక!
Razole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండల పరిషత్ అధ్యక్షురాలిగా చింతలపల్లి ఎంపీటీసీ సభ్యురాలు దొండపాటి కృష్ణవేణి, ఉపాధ్యక్షుడిగా చింతా దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు.
Razole: రాజోలు ఎంపీపీగా దొండపాటి కృష్ణవేణి ఎన్నిక!
రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండల పరిషత్ అధ్యక్షురాలిగా చింతలపల్లి ఎంపీటీసీ సభ్యురాలు దొండపాటి కృష్ణవేణి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రాజోలు ఎంపీటీసీ సభ్యుడు చింతా దుర్గా ప్రసాద్ ఎంపికయ్యారు.
కూటమి తరఫున ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించిన శివకోటి ఎంపీటీసీ సభ్యులు ఓటమి చెందడంతో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపు తిరిగాయి. కూటమి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం చింతలపల్లి టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు దొండపాటి కృష్ణవేణికి ఎంపీపీ పదవి దక్కింది.
తొలుత రాజోలులో 20 మంది ఎంపీటీసీ సభ్యులతో ప్రత్యేక ఎన్నికల అధికారి ఎస్.కె. మెహబూబ్ బాష ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.




