Amalapuram: టీడీపీ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి!
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీరాంపురంలో అకాల మరణం చెందిన టీడీపీ కార్యకర్త కేతా ప్రసాద్ అంత్యక్రియల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని పాడె మోశారు.
Amalapuram: టీడీపీ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి!
అమలాపురం: తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త పట్ల మంత్రి వాసంశెట్టి సుభాష్ చూపిన అభిమానం,ఆప్యాయత గౌరవం కూటమి శ్రేణులను కదిలించింది.డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీరాంపురంలో అకాల మరణం చెందిన మంత్రి అనుచరుడు, టీడీపీ కార్యకర్త స్వర్గీయ కేతా ప్రసాద్ అంత్యక్రియల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా పాల్గొని, పాడె మోసి తన అభిమానం చాటుకున్నారు.
కేతా ప్రసాద్ మృతి పట్ల మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పళ్ళంరాజుతో కలిసి ప్రసాద్ భౌతికకాయానికి నివాళులర్పించి,అంత్యక్రియల్లో పాల్గొన్నారు.స్వయంగా పాడె మోస్తూ పార్టీ కార్యకర్తకు తగిన గౌరవం ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,ధైర్యం చెప్పి ఓదార్చారు.
కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు,గౌరవం ఇవ్వడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం అన్నట్లుగా మంత్రి సుభాష్ వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంది. పదవులు,హోదాలతో సంబంధం లేకుండా సామాన్య కార్యకర్తను సైతం కుటుంబ సభ్యుడిగా భావిస్తూ,వారి కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తున్న మంత్రి సుభాష్ మానవీయతకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.
ఒక సామాన్య కార్యకర్త అంత్యక్రియలకు మంత్రి స్వయంగా హాజరై పాడె మోయడం పట్ల కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలే పార్టీకి పునాదులని, వారి పట్ల మంత్రి చూపిస్తున్న ఆదరణ, ఆప్యాయత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వాసంశెట్టి చినబాబు,కూటమి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




