Amalapuram: కోనసీమ జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్ల తుది గెజిట్ విడుదల!
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026కు సంబంధించి పంచాయతీలు, వార్డుల వారీగా తుది రిజర్వేషన్ల గెజిట్ విడుదల చేసిన కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.
Amalapuram: కోనసీమ జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్ల తుది గెజిట్ విడుదల!
Amalapuram: జిల్లాలో గ్రామపంచాయతీలకు సంబంధించి సాధారణ ఎన్నికలు-2026 నిర్వహణలో భాగంగా గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఖరారు చేసిన తుది రిజర్వేషన్ల గెజిట్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ విడుదల చేశారు.
గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిబంధనల మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి తుది గెజిట్ను విడుదల చేసినట్లు తెలిపారు.సంబంధిత గ్రామపంచాయతీలు,వార్డులకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలను అధికారిక గెజిట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.




