Amalapuram: కుటుంబ సమేతంగా ఓటేసిన ఎమ్మెల్యే ఆనందరావు!
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్.యానాంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కుటుంబ సమేతంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Amalapuram: కుటుంబ సమేతంగా ఓటేసిన ఎమ్మెల్యే ఆనందరావు!
అమలాపురం: ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత శక్తివంతమైన సాధనం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు వారి సతీమణి అరుణ,మరియు వారి తనయుడు,యువ నాయకులు కరణ్ లు ఎస్.యానాం గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్నారు.
అని ఎమ్మెల్యే తెలియజేసారు. ఓటు వేసిన అనంతరం ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది అత్యంత శక్తివంతమైన సాధనం. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామీణాభివృద్ధికి,స్థానిక పాలనకు మూలస్తంభాలు.అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు,స్థానిక ప్రజలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




