Allavaram: అల్లవరం మండలం తాడికోనలో టీడీపీలోకి వైసీపీ కార్యకర్తలు
Allavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తాడికోన గ్రామానికి చెందిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో టీడీపీలో చేరారు.
Allavaram: అల్లవరం మండలం తాడికోనలో టీడీపీలోకి వైసీపీ కార్యకర్తలు
అల్లవరం: అల్లవరం మండలం తాడికోనలో పసుపు జెండా రెపరెపలు ఎమ్మెల్యే ఆనందరావు సమక్షంలో టీడీపీలోకి చేరికలు.ఆ గ్రామానికి చెందిన నందిక శ్రీధర్ కుమార్,నందిక సావిత్రి,ఇంజె సత్యనారాయణ నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి తెలుగు దేశం పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు,ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. తాడికోన గ్రామ అభివృద్ధికి,పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




