Ravulapalem: కొమరాజులంకలో రూ.69 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం

Ravulapalem: కొమరాజులంకలో రూ.69 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించి, పుష్కర రహదారి పనులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 11 Oct 2026 9:42 PM IST
Ravulapalem
X

Ravulapalem: కొమరాజులంకలో రూ.69 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం

Ravulapalem: కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి కార్యక్రమాలకు విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.

రావులపాలెం మండలం కొమరాజులంకలో రూ.36 లక్షల పంచాయతీరాజ్ 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. గ్రామీణ వైద్య సేవలు మెరుగుదలకు హెల్త్ క్లినిక్ ల నిర్మాణం దోహదం చేస్తుందన్నారు.

అనంతరం రూ.33 లక్షల పుష్కర నిధులతో నిర్మించనున్న రహదారికి భూమి పూజ నిర్వహించారు. 2027 పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA