Konaseema: కొమరాజులంకలో వైభవంగా అయ్యప్ప కలశ పూజ, పడిపూజ
Konaseema: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమరాజులంకలో గురుస్వామి కర్రీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి కలశ పూజ, పడిపూజ ఘనంగా జరిగాయి.
Konaseema: కొమరాజులంకలో వైభవంగా అయ్యప్ప కలశ పూజ, పడిపూజ
Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో గురుస్వామి కర్రీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల కలశ పూజ, పడిపూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కొమరాజులంక వద్దకు చేరుకున్న అయ్యప్ప మాలధారులు భక్తి పారవశ్యంతో భజనలు చేస్తూ గోదావరి నది వద్దకు వెళ్లారు. అక్కడ పవిత్ర జలాలను కలశాల్లో తీసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశానికి తీసుకువచ్చారు. అనంతరం స్వామి ప్రతాప్‌రెడ్డి నివాసం వద్ద అయ్యప్ప మాలధారులంతా కలిసి కలశ పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అరటి డొప్పలతో 18 మెట్లను ఏర్పాటు చేసి, అయ్యప్ప స్వామి మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు చేపట్టారు.
అనంతరం 18 కర్పూర హారతులను వెలిగించి, వాటి చుట్టూ అయ్యప్ప మాలధారులు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తూ పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగింది. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.




