Rajahmundry: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్య కుటుంబానికి అండగా నిలిచిన బీజేపీ నేత!
Rajahmundry: అనారోగ్యంతో బాధపడుతున్న జగ్గంపేట దళిత యువతి చిర్ల సత్య వైద్య ఖర్చులకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించిన బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు.
Rajahmundry: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్య కుటుంబానికి అండగా నిలిచిన బీజేపీ నేత!
Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం బంగాళీ పేటకు చెందిన దళిత యువతి చిర్ల సత్య వైద్య ఖర్చులకు విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు గారు రూ. 10 వేలు ఆర్ధిక సహాయం అందించారు.
చిర్ల సత్య అనారోగ్యం కారణంగా రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వైద్య ఖర్చులకు సహాయం అందించాలని కుటుంబ సభ్యులు గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలానికి వచ్చి కంబాల శ్రీనివాసరావు గారిని కోరగా స్పందించిన ఆయన తక్షణ సహాయంగా రూ. పది వేలు ఆర్ధిక సహాయం అందించారు.




