Gokavaram: గోకవరం 7వ వార్డులో రేవాడ శారదకు కంబాల శ్రీనివాసరావు మద్దతు!

Gokavaram: గోకవరం పంచాయతీ 7వ వార్డు అభ్యర్థి రేవాడ శారదకు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి సంపూర్ణ మద్దతు తెలిపారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 16 Nov 2026 8:12 PM IST
Gokavaram
X

Gokavaram: గోకవరం 7వ వార్డులో రేవాడ శారదకు కంబాల శ్రీనివాసరావు మద్దతు!

Gokavaram: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గోకవరం 7వ వార్డు అభ్యర్థిగా రేవాడ శారదను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు బలపరిచారు.

గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రేవాడ శారద కంబాల శ్రీనివాసరావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు కంబాల శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డు అభ్యర్థిగా రేవాడ శారదను ప్రకటించి, ఆమెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని ప్రజలు ఆదరించాలని కంబాల శ్రీనివాసరావు కోరారు.

వార్డు ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే అవకాశం రేవాడ శారదకు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 7వ వార్డు ప్రజలు ఆమెకు అండగా నిలిచి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM