Kadiyam: కడియం జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి మహేశ్వరి దేవి విజయం!

Kadiyam: కడియం జడ్పీటీసీగా జనసేన పార్టీ అభ్యర్థిని రత్నం మహేశ్వరి దేవి 11,500 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తూర్పుగోదావరి జడ్పీ చైర్మన్ రేసులో ఆమె ముందంజలో ఉన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 7 Nov 2026 7:31 PM IST
Kadiyam
X

Kadiyam: కడియం జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి మహేశ్వరి దేవి విజయం!

కడియం: కడియం జడ్పిటిసి గా బుర్రిలంక గ్రామానికి చెందిన రత్నం మహేశ్వరి దేవి అయ్యప్ప జనసేన పార్టీ తరపు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. సమీప వైకాపా అభ్యర్థి కొత్తపల్లి నాగ శివాజీపై 11500 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి సీటు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ విజయాన్ని కారకలైన మంత్రి కందుల దుర్గేష్ కు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి లకు కూటమనేతలకు, తెలుగుదేశం,జనసేన, కార్యకర్తలకు మండల ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా పరిషత్ రేసులో ముందంజ : తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఓసి మహిళకు కేటాయించడంతో పాటు ఆ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మహేశ్వరీ దేవికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL