Kadiyam: నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్తును కాపాడుకుందాం!
Kadiyam: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో నీటి సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలని హౌసింగ్ ఏఈ మూర్తి సూచించారు.
Kadiyam: నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్తును కాపాడుకుందాం!
కడియం: కడియం, ప్రతి నీటి బొట్టు అత్యంత విలువైనదని, దానిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని హౌసింగ్ ఏఈ బి వి వి ఎస్ మూర్తి కోరారు. వేమగిరిలో శనివారం సేవ్ వాటర్ - సేవ్ ఫ్యూచర్ నినాదంతో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, తద్వారా వర్షపు నీటిని భూము లోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చు అన్నారు. పత్తి వర్షపు చుక్కను ఒడిసిపెట్టి భూగర్భ జలమట్టాలను పెంచుకోవాలని వివరించారు.
అలాగే ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో ఒక మొక్కను నాటడం, సంరక్షించడం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని గ్రామస్తులకు సూచించారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు జగతా శివ కృష్ణ, గుణ్ణంపల్లి శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.




