Kadiyam: తుఫాను ప్రభావంతో కూలిన పెంకుటిల్లు
Kadiyam: కడియపులంకలో తుఫాను ఉధృతికి పెంకుటిల్లు పైకప్పు కూలింది. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులు అప్రమత్తం కావడంతో తప్పిన పెను ప్రమాదం.
Kadiyam: తుఫాను ప్రభావంతో కూలిన పెంకుటిల్లు
కడియం: తుఫాను ప్రభావంతో కడియం మండలం కడియపులంక గ్రామంలో ఓ పెంకుటిల్లు పై కప్పు హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న భార్యాభర్తలు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కడియపులంక గ్రామానికి చెందిన ఇసుకపట్ల రామకృష్ణ, లక్ష్మి దంపతులు ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు.
శుక్రవారం తుఫాను ప్రభావంతో భారీగా గాలులు వీస్తున్న సమయంలో దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇంటి పై కప్పు కూలిపోయింది. ఇంట్లో ఉన్న భార్య భర్తలు అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి దెబ్బతిన్నట్లు బాధితులు తెలిపారు.
రామకృష్ణ, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా, వారికి వివాహాలు జరిపించి పంపించారు. ప్రస్తుతం దంపతులు ఇద్దరే ఈ ఇంట్లో నివసిస్తున్నారు. కూలిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. తుఫాను ప్రభావంతో పాత ఇళ్లు, బలహీనంగా ఉన్న నిర్మాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.




