Kadiyam: వర్కింగ్ జర్నలిస్టుల శ్రేయస్సుకు కృషి చేస్తా: కడియం సర్పంచ్!

Kadiyam: రాజమండ్రి రూరల్ కడియం సర్పంచ్‌గా గెలుపొందిన మాజీ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ను కడియం ప్రెస్ క్లబ్ సభ్యులు సత్కరించగా, జర్నలిస్టుల శ్రేయస్సుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 27 Nov 2026 2:28 PM IST
Kadiyam
X

Kadiyam: వర్కింగ్ జర్నలిస్టుల శ్రేయస్సుకు కృషి చేస్తా: కడియం సర్పంచ్!

కడియం: వర్కింగ్ జర్నలిస్టుల శ్రేయస్సు ఆకాంక్షించే మాజీ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ కడియం సర్పంచ్ గా విజయకేతనం ఎగురవేయడం పట్ల ఆయన నివాసంలో కడియం ప్రెస్ క్లబ్ సత్కరించింది. జర్నలిస్టుల సంక్షేమానికి తను కట్టుబడి ఉంటారని ప్రసాద్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఎంపీపీగా కడియం మండల అభివృద్ధికి విశేషంగా సేవలందించిన ప్రసాద్ కడియం సర్పంచ్ గా మరింత గ్రామాభివృద్ధి సాధించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిక్కాల సూరిబాబు , ఉపాధ్యక్షులు శెట్టి పోసిబాబు కార్యదర్శి అన్నందేవుల సూర్యచంద్రరావు, కోశాధికారి కొప్పిశెట్టి సుబ్రమణ్యం, సలహాదారు పళ్ళ వెంకటగిరి,సీనియర్ జర్నలిస్టులు బెజవాడ గౌరీ శంకర్ ,దూడల అర్జున్ లు అన్నారు. సర్పంచ్ ప్రసాదను సత్కరించిన వారిలో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ తదితరులు ఉన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL