Kadiyam: కడియంలో ఘనంగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార ర్యాలీ!

Kadiyam: కడియంలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కోరుతూ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ. భారీగా పాల్గొన్న నేతలు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 3 Nov 2026 10:45 AM IST
Kadiyam
X

Kadiyam: కడియంలో ఘనంగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార ర్యాలీ!

కడియం: స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కడియం మండలంలోని కడియపులంక, బుర్రిలంక, వెంకాయమ్మ పేట, కడియం తదితర గ్రామాలలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, టిడిపి హెల్త్ వింగ్ జనరల్ సెక్రటరీ గోరంట్ల రవిరాం కిరణ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, రాజమండ్రి మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, కడియం మాజీ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, అన్నందేవుల చంటి, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ముద్రగడ జమీ, పంతం గణపతి, పాఠంశెట్టి రాంజీ, గట్టి నరసయ్య, గట్టి సుబ్బారావు, వెలుగుబంటి నాని, గెడ్డం శివ, ఆదిమూలం సాయిబాబా తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రజల నుండి లభిస్తున్న ఆత్మీయ పలకరింపులు ఆశీర్వాదాలు కూటమి అభ్యర్థుల ప్రచారానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయన్నారు. కడియం మండల జడ్పిటిసి కూటమి అభ్యర్థిని రత్నం మహేశ్వరి దేవి, ఎంపీపీ అభ్యర్థిని బోడపాటి మోహిని వీర పుణ్యవతి, ఇతర కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL