Kadiyam: కడియంలో కొరవడిన సమన్యాయం: ఒకే ఊరికి కీలక పదవులు!
Kadiyam: కడియం మండలంలో 10 గ్రామాలున్నా జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులన్నీ కడియపులంకకే కేటాయించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Kadiyam: కడియంలో కొరవడిన సమన్యాయం: ఒకే ఊరికి కీలక పదవులు!
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో సమన్యాయం కొరవడింది స్థానిక ఎన్నికల్లో 10 గ్రామాలు ఉన్న ఈ మండలంలో ఒక గ్రామానికి పదవులన్నీ కేటాయించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార బిజెపి జనసేన టిడిపి కూటమి పార్టీలు కడియపులంక గ్రామానికి జడ్పిటిసి ఎంపీపీ అభ్యర్థిత్వాలను కట్టబెట్టింది. మండలం కేంద్రమైన కడియం గ్రామానికి ఒక్క పదవి కూడా కేటాయించలేదు.
దుల్ల ,మురమండ ,వీరవరం, దామిరెడ్డిపల్లి, మాధవరాయుడుపాలెం, కడియపుసావరం పొట్టిలంక గ్రామాల దిక్కే చూడలేదు.. గెలుపు ఓటమి ఎవరు వహించిన,, కడియపులంక గ్రామానికి ఆ పదవులన్నీ వరిస్తాయి.. ఈ విధానం వల్ల గ్రామాల అభివృద్ధిపై దుష్ప్రభావం పడవచ్చు. అభివృద్ధినిధులు కడియపులంక గ్రామానికి ఎక్కువ శాతం కేటాయించబడతాయి. మిగిలిన గ్రామాలు అభివృద్ధిలో వెనకబడి పోవచ్చు. సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మండలంలో రాజకీయ అస్త్ర సన్యాసం నెలకొన్నట్లు భారీ ప్రచారం జరుగుతుంది.




