Kadiyam: ఘనంగా 'జై కిసాన్ జై జవాన్' వేడుకలు, ప్రముఖుల సత్కారం

Kadiyam: కడియంలో గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల ప్రముఖులను ఘనంగా సత్కరించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 2 Oct 2026 10:35 PM IST
Kadiyam
X

Kadiyam: ఘనంగా 'జై కిసాన్ జై జవాన్' వేడుకలు, ప్రముఖుల సత్కారం

కడియం: కడియం పంచాయతీ కళ్యాణ మండపంలో జరిగిన జై కిసాన్ జై జవాన్ కార్యక్రమం అధ్యక్షులు చిక్కాల ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

పలువురు వక్తలు మాట్లాడుతూ దేశం కోసం సర్వస్వాన్ని అర్పించి, చివరికి తన ప్రాణాలు సహితం అర్పించిన మహాత్ముడుగాంధీజీ అయితే, 17 సంవత్సరాల వయసులో స్వాతంత్ర ఉద్యమంలోని ప్రవేశించి, కేంద్రమంత్రిగా, రెండవ ప్రధానమంత్రిగా పదవులు చేపట్టి నిస్వార్ధమైన నిజాయితీపరుడైన ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రని "జై జవాన్ జై కిసాన్" సేవా సమితి కడియం వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కాల ఈశ్వరరావు అన్నారు.

కడియం మండలం కేంద్రంగా ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఆల్ ఇండియా నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసిన పల్లా సుబ్రహ్మణ్యాన్ని కడియం పిహెచ్సి వైద్యురాలు మాధురి, ఇరిగేషన్ ఇంజనీర్ ఆర్. నాగేశ్వరరావు, బిజెపి కాకినాడ నియోజకవర్గం ఇంచార్జ్ ఆకుల శ్రీధర్, న్యాయవాది తోరాటి వసంతరావు, డాక్టర్ గుర్రాల వెంకట్రావు, రవి, రమణలను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిలుకూరు శ్రీనివాసరావు, విశ్రాంత ఉపాధ్యాయులు నీలకంఠరావు, గొల్లపల్లి సత్యనారాయణ, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL