Kadiyam: కడియంలో వినాయక నవరాత్రుల ముగింపు: భారీ అన్నసమారాధన

Kadiyam: వినాయక చవితి నవరాత్రి ముగింపు సందర్భంగా కడియం భాస్కర రామ నగర్ శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో వేలాది మంది భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 4 Oct 2026 7:02 PM IST
Kadiyam
X

Kadiyam: కడియంలో వినాయక నవరాత్రుల ముగింపు: భారీ అన్నసమారాధన

కడియం: వినాయక చవితి నవరాత్రి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రమైన కడియం గ్రామం లోని భాస్కర రామ నగర్ శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో కమిటీ సభ్యులు గ్రామస్తుల సహకారంతో ఆదివారం భారీ అన్నసమారాధన నిర్వహించారు.

తెల్లవారుజాము నుండీ ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, పిండివంటలతో కూడిన ప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో కడియం తాజా మాజీ ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి, కడియం మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని, కొత్తపల్లి శివాజీ తదితరులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL