Kadiyam: మిత్రుడి మరణం బాధాకరం: తాడాల కొండ్రాజు సంతాపం

Kadiyam: కడియం మండలం బుర్రిలంకకు చెందిన చిన్ననాటి మిత్రుడు రత్నం సత్యనారాయణ ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్ నేత తాడాల కొండ్రాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 28 Sept 2026 5:21 PM IST
Kadiyam
X

Kadiyam: మిత్రుడి మరణం బాధాకరం: తాడాల కొండ్రాజు సంతాపం

కడియం: చిన్నప్పటి నుంచి తనతో కలిసి మెలిసి పెరిగిన చిన్ననాటి మిత్రుడు, కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన రత్నం సత్యనారాయణ ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తాడాల కొండ్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

తీర్థయాత్ర నిమిత్తం తాను సుదూర ప్రాంతంలో ఉండటంతో సత్యనారాయణ మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలిసిందని ఆయన తెలిపారు. చిన్ననాటి నుంచి సత్యనారాయణతో తనకు ఉన్న స్నేహానుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

సత్యనారాయణ కుమారులు అయ్యప్ప, దొరబాబులతో పాటు కుటుంబ సభ్యులకు తాడాల కొండ్రాజు ఫోన్ ద్వారా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యనారాయణ మృతి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL