Rajamahendravaram: సోషల్ మీడియా పాలసీ రద్దు చేయాలి!

Rajamahendravaram: విలేకరుల సమావేశం నిర్వహించిన జేడీఆర్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లులెన్సర్ల పాలసీ రద్దుకు డిమాండ్.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 29 Sept 2026 2:17 PM IST
Rajamahendravaram
X

Rajamahendravaram: సోషల్ మీడియా పాలసీ రద్దు చేయాలి!

Rajamahendravaram: సోషల్ మీడియా ఇన్‌ఫ్లులెన్సర్ల ఎంపానెల్‌మెంట్ పాలసీ ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని జే.డి.ఆర్.ఎఫ్ ( జర్నలిస్ట్ డెమొక్రటిక్ రైట్స్ ఫారం) జాతీయ ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్షరాన్ని నమ్ముకుని జీవిస్తున్న విలేకరులను రోడ్డున పడవేసి, అక్షరాన్ని అమ్ముకునే ఇన్ఫ్యులెన్స్ లకు ప్రాధాన్యత ఇవ్వడం తగదని అన్నారు.

సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య ఇస్తూ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని అన్నారు. గతంలో రాజుల పాలనలో బట్రాజుల విధానం ఉండేదని వారి చేత రాజులను కీర్తిస్తూ కవితలు వ్యాఖ్యలు చేసే వారిని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఇన్ఫ్లెన్సర్ల విధానం కూడా బటరాజుల విధానంతో పోలి ఉందని పేర్కొన్నారు.

ఈ జీవోను తక్షణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి భజన చేసే వారిని గౌరవ వేతనం ఇచ్చి ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిజాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

జర్నలిస్టులను అగౌరవపరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని అన్నారు. అక్రమ సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్ల వల్ల జర్నలిస్టుల ఉనికి ప్రమాదంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై సర్వే చేసి జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్రం నిధులతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రభుత్వాలు జర్నలిస్టుల పై అక్రమ కేసులు పెట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన జర్నలిస్టుల కుటుంబాలు బ్రతకడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జె డి ఆర్ ఎఫ్ జర్నలిస్టుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తుందని అన్నారు. నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, కోనసీమ జిల్లాలో జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడితే వారికి అండగా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జె డి ఆర్ ఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు మారంపూడి సోమరాజు, జిల్లా అధ్యక్షులు గాదె గిరీష్ కుమార్ గుప్త, కార్యదర్శి సింగంశెట్టి సూర్య రాఘవేంద్ర, ట్రెజరర్ పిచ్చుక మహేష్ , నజీర్ తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY