Chintoor: ముకునూరులో నాగరాజు ఇంటింటి ప్రచారం.. జనసేన నేతల మద్దతు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం ముకునూరు పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాయం నాగరాజు ఇంటింటి ప్రచారంతో జోరు పెంచారు.
Chintoor: ముకునూరులో నాగరాజు ఇంటింటి ప్రచారం.. జనసేన నేతల మద్దతు!
Chintoor: చింతూరు మండలం ముకునూరు పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాయం నాగరాజు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.గ్రామంలోని ప్రతి వీధిలో తిరుగుతూ ఓటర్లను కలుస్తున్న నాగరాజుకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు.
మహిళలు, యువకులు, పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు.పంచాయతీలో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను తనను గెలిపిస్తే పరిష్కరిస్తానని, గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని నాగరాజు హామీ ఇస్తున్నారు.
ఈ ప్రచారంలో జనసేన నాయకులు ప్రవీణ్ కుమార్ (కప్పు), సతీష్ లు దగ్గరుండి ఇంటింటి ప్రచారం చేశారు. నాగరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు.




