Chintoor: అనారోగ్యాన్ని జయించి బరిలోకి.. చింతూరులో జమాల్ ఖాన్ సునామి
Chintoor: అనారోగ్యం నుంచి కోలుకున్న టీడీపీ మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్ ఆధ్వర్యంలో చింతూరు మెయిన్ సెంటర్‌లో నిర్వహించిన కూటమి భారీ ర్యాలీతో రాజకీయం వేడెక్కింది.
Chintoor: అనారోగ్యాన్ని జయించి బరిలోకి.. చింతూరులో జమాల్ ఖాన్ సునామి
చింతూరు: చింతూరు మండల రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎన్నికల ముందు అనారోగ్యానికి గురై అందరినీ కలవరపెట్టిన టీడీపీ మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్, సింహంలా తిరిగి రావడంతో టీడీపీ, కూటమి శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే విశ్రాంతి కూడా తీసుకోకుండా, గ్రామగ్రామాన దూసుకెళ్తున్నారు జమాల్ ఖాన్.
"12 ఎంపీటీసీలు, జడ్పీటీసీ మనదే" అంటూ ప్రతి గడపకు వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఆయన రాకతో నీరసించిన క్యాడర్ లో ఒక్కసారిగా జోష్ పెరిగింది.అసలు హైలెట్ నేడు సాయంత్రం. ప్రచారానికి చివరి గంట మోగే సమయానికి... చింతూరు ప్రధాన సెంటర్ దద్దరిల్లిపోయింది. కూటమి ఆధ్వర్యంలో జమాల్ ఖాన్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
జెండాలు, నినాదాలతో చింతూరు సెంటర్ పసుపు మయమైంది.ఈ సందర్భంగా జమాల్ ఖాన్ మాట్లాడుతూ... "కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పాలన, అభివృద్ధి ప్రతి పల్లెకు చేరాలంటే... మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఒక్కటే మార్గం - కూటమి అభ్యర్థులను గెలిపించడం" అంటూ హుంకరించారు.చివరి రోజు జమాల్ ఖాన్ చూపించిన దూకుడుతో చింతూరులో ఎన్నికల ఫలితాలు ఎటు మొగ్గుతాయోనన్న ఉత్కంఠ మొదలైంది.




