Polavaram: జమాల్ ఖాన్ సారథ్యంలో ఊపందుకున్న కారం సత్యవతి ఎన్నికల ప్రచారం!

Polavaram: చింతూరు పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని కారం సత్యవతి ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. జమాల్ ఖాన్ సారథ్యంలో కత్తెర గుర్తుపై ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 28 Nov 2026 1:38 PM IST
Polavaram
X

Polavaram: జమాల్ ఖాన్ సారథ్యంలో ఊపందుకున్న కారం సత్యవతి ఎన్నికల ప్రచారం!

Polavaram: డివిజన్ హెడ్ క్వార్టర్ చింతూరు పంచాయతీ పీఠం కోసం పోరు రసవత్తరంగా మారింది. తెలుగుదేశం అభ్యర్థి కారం సత్యవతి ప్రచారం దూసుకుపోతోంది.గ్రామ గ్రామాన కాలినడకన తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్లి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.."కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి" అంటూ సత్యవతి చేస్తున్న అభ్యర్థనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.సత్యవతి ప్రచారానికి తెలుగుదేశం అధ్యక్షులు, ఆపద్బాంధవుడు జమాల్ ఖాన్ దగ్గరుండి సారథ్యం వహిస్తున్నారు. ప్రజాసేవే పరమావధిగా భావించే జమాల్ ఖాన్ తోడు రావడంతో ప్రచారానికి మరింత జోష్ వచ్చింది. ఆయన వెంట నడుస్తుంటే.కార్యకర్తల్లో ఉత్సాహం, ప్రజల్లో నమ్మకం రెట్టింపు అవుతోంది. ఓటర్లు సైతం "ఈసారి సత్యవతమ్మకే మా ఓటు" అంటూ మహిళలు, యువత ముందుకొస్తున్నారు. అభివృద్ధి చేసే నాయకురాలు, అందరినీ కలుపుకుపోయే మనసున్న మనిషి అంటూ సత్యవతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.చింతూరులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట. సత్యవతి గెలుపు ఖాయం !.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR