Jaggampeta: జగ్గంపేట కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా మహిపాల గణేష్

Jaggampeta: కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా గోకవరానికి చెందిన జనసైనికుడు మహిపాల గణేష్ నియమితులయ్యారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 17 Oct 2026 6:23 PM IST
Jaggampeta
X

Jaggampeta: జగ్గంపేట కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా మహిపాల గణేష్

కాకినాడ: కాకినాడ పార్లమెంట్ పరిధిలో జగ్గంపేట నియోజకవర్గ స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ లో నిర్వాహకదళ్ సభ్యులుగా గోకవరం జనసైనికుడు మహిపాల వీర వెంకట సత్యనారాయణ(గణేష్) నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియామక పత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా మహిపాల గణేష్ మాట్లాడుతూ నా లాంటి కూలి పని చేసుకునే వ్యక్తికి జనసేన పార్టీ ఇంతటి సముచిత స్థానం కల్పిస్తుందని ఊహించనే లేదని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశానే తప్ప ఏనాడు పదవుల కోసం చూడలేదన్నారు.

అయినప్పటికీ జనసేన పార్టీ నన్ను గుర్తించి, ఇంతటి బాధ్యతను తనకు అప్పగించడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు, జగ్గంపేట జనసేన ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకుని గ్రామీణ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మహిపాల వీర వెంకట సత్యనారాయణ (గణేష్) తెలిపారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM