Gokavaram: జగ్గంపేట జనసేన సమన్వయ కమిటీలో కోట రామాంజనేయులు
Gokavaram: జగ్గంపేట నియోజకవర్గ జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో రంప యర్రంపాలెంకు చెందిన కోట సీతారామాంజనేయులుకు చోటు దక్కింది.
Gokavaram: జగ్గంపేట జనసేన సమన్వయ కమిటీలో కోట రామాంజనేయులు
గోకవరం: జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ లో భాగంగా పార్టీ కోసం కష్టపడిన నేతలకు మూడు విభాగాల్లో స్థానిక ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ సిఫార్సుతో మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ వారి ఆదేశాల మేరకు స్థానం కల్పించారు.
దీనిలో భాగంగా రంప యర్రం పాలెం గ్రామానికి చెందిన కోట సీతారామాంజనేయులు కు సపోర్ట్ టీం లో స్థానం కల్పించారు. ఈ కమిటీలో స్థానం కల్పించినందుకు కోట సీతారామాంజనేయులు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఈ స్థానం కల్పించిన నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ కి మరియు జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి కొణేదల పవన్ కళ్యాణ్ కు తన కృతజ్ఞతలు తెలియపరిచారు.
ఈ పదవిని బాధ్యతగా తీసుకొని పార్టీ అభివృద్ధికి మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు అహర్నిశలు కృషి చేస్తానని కోట సీతారామాంజనేయులు తెలిపారు. (రాంబాబుకి) ఈ పదవి దక్కడంతో మండలానికి, గ్రామానికి సంబంధించిన పలువురు జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు.




