Amalapuram: 8వ వేతన సంఘంలోకి GDS: ఎంపీ హరీష్‌కు వినతి
Amalapuram: గ్రామీణ తపాలా (GDS) ఉద్యోగులను 8వ వేతన సంఘం పరిధిలోకి తేవాలని కోరుతూ అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగికి AIGDSU నేతలు వినతిపత్రం సమర్పించారు.
Amalapuram: 8వ వేతన సంఘంలోకి GDS: ఎంపీ హరీష్‌కు వినతి
Amalapuram: జీడీఎస్ ఉద్యోగులను 8వ వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలి అని ఎంపీ హరీష్ బాలయోగికి గ్రామీణ తపాలా ఉద్యోగుల వినతి పత్రం అందజేశారు.గ్రామీణ తపాలా ఉద్యోగులను 8వ వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలని,మెరుగైన వేతనాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
యూనియన్ కేంద్ర సంఘం పిలుపులో భాగంగా అమలాపురం డివిజన్ ఉద్యోగులు,నాయకులు ఎంపీ గంటి హరీష్ బాలయోగిని కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా యూనియన్ డివిజనల్ కార్యదర్శి,మాజీ రాష్ట్ర కార్యదర్శి వి.వి. రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సేవలందిస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులకు అన్యాయం చేయడం తగదన్నారు.
జీడీఎస్ ఉద్యోగులను 8వ వేతన సంఘం పరిధిలోకి తీసుకురావాలని,గ్రాట్యుటీ,వైద్య సదుపాయాలు,ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని,సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని కోరారు. అవసరమైతే వారి సమస్యల పరిష్కారానికి జ్యుడీషియల్ కమిటీని నియమించాలని విజ్ఞప్తి చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని ఎంపీని కోరారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.




