Amalapuram: ఎమ్మెల్యే ఆనందరావు సమక్షంలో టీడీపీలోకి చేరికలు!

Amalapuram: కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి తూర్పులంకలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కండువాలు కప్పి ఆహ్వానించారు.

SURESH, AMALAPURAM
Published on: 13 Oct 2026 6:11 PM IST
Amalapuram
X

Amalapuram: ఎమ్మెల్యే ఆనందరావు సమక్షంలో టీడీపీలోకి చేరికలు!

అమలాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంస్కరణలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి తూర్పులంక నుంచి వైసీపీ కార్యకర్తలు భారీ చేరికలు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో టీడీపీలోకి పలువురి చేరికలు.తెలుగు దేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆనందరావు.అమలాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీల అభివృద్ధి ప్రస్థానాన్ని చూసే ఈ చేరికలు అని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సుపరిపాలన మరియు సంక్షేమ ఫలాలు మరియు అమలాపురం నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై అల్లవరం మండలం తూర్పులంక గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు పలువురు స్థానిక అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు సమక్షంలో అధికారికంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే ఆనందరావు సాదరంగా టీడీపీ లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అల్లవరం నుండి రెల్లిగడ్డ మీదుగా తూర్పులంక వరకు ఉన్న రోడ్డు తీవ్రంగా దెబ్బతిని ప్రజలు గుంతల రోడ్డుతో నరకయాతన అనుభవించారని,అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోడ్డును నూతనంగా నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరించామని తెలిపారు. అలాగే గతంలో స్థానిక మహిళలు బస్సు సౌకర్యం కావాలని కోరిన వెంటనే తక్షణమే ఆర్టీసీ డిపో మేనేజర్‌తో మాట్లాడి బస్సు నడిపించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు సంక్షేమాన్ని,అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని,బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చూసే గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందనిఎమ్మెల్యే భరోసా కల్పించారు,ఇటువంటి నిజమైన ప్రజా సంక్షేమాన్ని చూసే గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు.

తెలుగు దేశం పార్టీలో చేరిన వారిలో కుంచె అర్జునరావు,కుంచె దుర్గ, జల్లి సత్యనారాయణ (స్వామి), జల్లి కళావతి,జల్లి ప్రసాద్,జల్లి నాగేశ్వరరావు,జల్లి సువార్తమ్మ, పొలమూరి సుధాకర్, పొలమూరి లక్ష్మి,పొలమూరి బాలకృష్ణ,మాకే సత్యనారాయణ,మాకే దుర్గ భవాని,కుంచె లోవరాజు,బొమ్మి పెద్ద సింహాద్రి,బొమ్మి వెంకటేశ్వరరావు,బొమ్మి చిన్న సింహాద్రి,బొమ్మి అక్కమ్మ, ఆకుమర్తి జాంగారావు,ఆకుమర్తి కుమారి,బెల్లంకొండ భూషణం, బెల్లం కొండ వెంకయ్యమ్మ, అమలదాసు మాసేనమ్మ, అమలదాసు రమణ, కట్టారాంబాండు,మామిడిశెట్టి మనోహర్,చిత్తూరు నిరయ్య, చిత్తూరు సుబ్బన్న,బొంతు రాంబాబు,పాటి తాండవకృష్ణ, ఇల్లా జయప్రకాశ్,పాటి సత్యవతి,కడలి శ్రీరాములు, చిట్టూరి రామలక్ష్మి,ఇల్లా లక్ష్మి, బొంతు పద్మావతి,బొంతు రమ్య పద్మ,రాయుడు రజిని,చిట్టూరి మహాలక్ష్మి,కొప్పుల దుర్గ పార్వతి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి కార్యకర్తలు,నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM