Rajahmundry:2008లో కనుమరుగైన కడియం నియోజకవర్గంలో చిగురిస్తున్న ఆశలు!
Rajahmundry: డీలిమిటేషన్ బిల్లు కదలికతో 2008లో రద్దయిన కడియం నియోజకవర్గం మళ్లీ ఊపిరి పోసుకోనుంది.
Rajahmundry:2008లో కనుమరుగైన కడియం నియోజకవర్గంలో చిగురిస్తున్న ఆశలు!
Rajahmundry: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గం గా గుర్తింపు తెచ్చుకున్న నాటి కడియం నియోజకవర్గం 2008 నియోజకవర్గాల పునర్విభజనలో కనుమరుగైంది. తాజాగా డెలిమిటీషన్ బిల్లు కదలిక మొదలు కావడంతో కడియం నియోజకవర్గం మళ్ళీ ఊపిరి పోసుకోనుంది .నాటి రాజకీయ వైభవాన్ని సంతరించుకోనుంది. స్థానిక నాయకత్వాలకు జవసత్వాలు అందించనుంది. రాజకీయ చిత్ర పఠంలో కడియం కేవలం మండల కేంద్రం గా మిగిలిపోయింది.
1972 లో ఏర్పడిన కడియం నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా ఉండేది.మన మండలం నుండి ఇద్దరు నాయకులు ఎమ్మెల్యే లు గా పదవి అలంకరించిన చరిత్ర ఉంది. నాటి కడియం నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా స్వర్గీయ బత్తిన సుబ్బారావు పనిచేసిన తర్వాత మన మండలం నుండి పాఠంశెట్టి రామారావు, గిరజాల వెంకటస్వామి నాయుడులను ఎమ్మెల్యేలుగా గెలిపించిన ఘనత మన కడియంకు ఉంది.
ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో స్థానిక నాయకులు ఒక్కరు కూడా అందలం ఎక్కలేకపోయారు. టిడిపి నుండి వడ్డీ వీరభద్రరావు, కాంగ్రెస్ పార్టీ నుండి జక్కంపూడి గ్రామం రామ్మోహన్ రావు ఎమ్మెల్యేలుగా గెలిచి కడియం నియోజకవర్గంపై పట్టు సాధించారు. కాపులకు మంచి పట్టు గలిగిన ఈ నియోజకవర్గంలో 2008 రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అవతరించిన తర్వాత కాపు నేతలు పట్టుకోల్పోయారు.తొలి ఎమ్మెల్యేగా చందన రమేష్ గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. కడియం నియోజకవర్గం ఊపిరి పోసుకుంటే స్థానిక నాయకత్వాలకు పట్టు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 70000 ఓటర్లు తో ఉన్న కడియం మండలంలో మరికొన్ని గ్రామాలు విలీనం చేసి పూర్తి నియోజకవర్గంగా మార్చే కసరత్తు త్వరలో జరగనుంది . అలా జరిగితే కాపులకు పూర్తి పట్టు ఉన్న నియోజకవర్గంగా కడియం మారుతుంది.




