Razole: లక్కవరంలో మానవత్వం చాటుకున్న హోప్ హెల్పింగ్ ఫౌండేషన్!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్కవరంలో మానవత్వం చాటుకున్న హోప్ హెల్పింగ్ ఫౌండేషన్. రెండు చేతులు కోల్పోయిన నిరుపేద కుటుంబానికి సాయం.
Razole: లక్కవరంలో మానవత్వం చాటుకున్న హోప్ హెల్పింగ్ ఫౌండేషన్!
Razole: అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం బి.సావరం గ్రామానికి చెందిన ఆచంట కృష్ణమూర్తి రెండు చేతులు కోల్పోయి, ప్రభుత్వ పింఛన్ అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో హోప్ హెల్పింగ్ ఫౌండేషన్ మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించి అండగా నిలిచింది.
మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో బోణం రాజు నివాసం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మలికిపురం ఎస్సై ఎం. మోహన్ కుమార్ చేతుల మీదుగా కృష్ణమూర్తి కుటుంబానికి నగదు సహాయం, నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రభుత్వ పింఛన్ మంజూరయ్యే వరకు ప్రతి నెలా నిత్యావసర సరుకులు అందించాలని నిర్ణయించినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మరో నాలుగు కుటుంబాలకు కూడా నగదు సహాయం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవతా సేవలను కొనసాగిస్తున్న ఫౌండేషన్ సభ్యులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో బోణం రాజు, అరిగెల బలరామ్ మూర్తి, ఈశ్వరరావు, ఉమాలలత శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు.




