Razole: రాజోలులో ఆపదలో ఉన్న కుటుంబానికి హోప్ హెల్పింగ్ ఫౌండేషన్ చేయూత!
Razole: రాజోలు మండలం బి.సావరంకు చెందిన కృష్ణమూర్తి కుటుంబానికి హోప్ హెల్పింగ్ ఫౌండేషన్ నిత్యావసరాలు, దాతల సహకారంతో రూ.12 వేల నగదు అందజేసింది.
Razole: రాజోలులో ఆపదలో ఉన్న కుటుంబానికి హోప్ హెల్పింగ్ ఫౌండేషన్ చేయూత!
Razole: ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది హోప్ హెల్పింగ్ ఫౌండేషన్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బి.సావరం గ్రామానికి చెందిన ఆచంట కృష్ణమూర్తి రెండు చేతులు కోల్పోయి, ప్రభుత్వ పింఛన్ కూడా అందక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో గత నెలలో ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందించిన ఫౌండేషన్ నిర్వాహకులు, ఈ నెల కూడా రూ.1,500 విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
లక్కవరం గ్రామంలో మానవతా మూర్తుల సంస్థ వ్యవస్థాపకులు బోణం రాజు నివాసం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మలికిపురం జెడ్పీటీసీ మల్లిపూడి సత్తిబాబు, ఎంపీపీ బోడపాటి వరలక్ష్మి చేతుల మీదుగా కృష్ణమూర్తి కుటుంబానికి రూ.12 వేల నగదు సహాయం అందించారు. ఇందులో అంబాజీపేట మాజీ జెడ్పీటీసీ అరిగెల బలరామమూర్తి రూ.11 వేలు, రుద్రరాజు రంగరాజు రూ.1,000 విరాళంగా అందించారు.
ప్రభుత్వ పింఛన్ మంజూరయ్యే వరకు ప్రతి నెలా కృష్ణమూర్తి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించాలని హోప్ హెల్పింగ్ ఫౌండేషన్ నిర్వాహకులు నిర్ణయించారు. చిన్న సాయం కూడా ఆపదలో ఉన్న కుటుంబానికి కొండంత భరోసా ఇస్తుందని, మరింతమంది దాతలు, సేవా సంస్థలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బోణం రాజు, శృంగారపు సూర్యప్రకాష్, దొంగ జానకిరామయ్య, వీరా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




