Chinturu: నేటి సాయంత్రం 5 గంటలతో ముగియనున్న ప్రచార పర్వం!

Chinturu: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ముగియనున్న ఎన్నికల ప్రచారం. నాలుగు మండలాల్లో నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ పోరు సాగుతోంది.

RAJESH REDDY, CHINTOOR
Updated on: 3 Nov 2026 12:01 PM IST
Chinturu
X

Chinturu: చింతూరు ఏజెన్సీలో ముగిసిన ఎన్నికల ప్రచారం!

Chinturu: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ ఇప్పుడు ఎన్నికల వేడితో నిప్పులా కాలుతోంది. అటు దట్టమైన అడవులు, ఇటు గోదావరి గలగలల మధ్య నాలుగు మండలాల్లో రాజకీయ సమరం పతాకస్థాయికి చేరింది.కూనవరం, ఎటపాక, వీ.ఆర్.పురం, చింతూరు ఈ నాలుగు మండలాల్లో మొత్తం 39 ఎంపీటీసీ, 4 జడ్పీటీసీ స్థానాలే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకెళ్తున్నాయి.

చింతూరులో 12, ఎటపాకలో 12, కూనవరంలో 8, వీ.ఆర్.పురంలో 7 ఎంపీటీసీ సీట్లకు అభ్యర్థులు నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు.ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. "మమ్మల్ని గెలిపించండి... ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు చెక్ పెడతాం" అంటూ ఒక పార్టీ అంటే, "మా హయాంలోనే ఏజెన్సీకి మహర్దశ పట్టింది" అంటూ మరో పార్టీ సంక్షేమ, అభివృద్ధి మంత్రం జపిస్తోంది.

గడప గడపకు తిరుగుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.అయితే అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. ఇక ఆ తర్వాత మొదలయ్యేది సైలెంట్ వార్. మద్యం, డబ్బు పంపకాలపై అధికారులు నిఘా పెట్టారు.మరి ఏజెన్సీ గిరిజనుల గుండె చప్పుడు ఎవరి వైపు ? ఏ పార్టీ సత్తా చాటుతుంది ? ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే !

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR