Chemudulanka: చెముడులంకలో మహిళల భారీ సమీకరణతో టిడిపి ప్రచారం!

Chemudulanka: ఆలమూరు మండలం చెముడులంకలో టిడిపి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల విస్తృత ప్రచారం. పసుపుమయమైన గ్రామ వీధులు, ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, కూటమి నేతలు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 1 Nov 2026 11:38 AM IST
Chemudulanka
X

Chemudulanka: చెముడులంకలో మహిళల భారీ సమీకరణతో టిడిపి ప్రచారం!

Chemudulanka: ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం సందడిగా సాగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈదల సత్తిబాబు , జడ్పీటీసీ అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు, ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి పాలూరు దుర్గాభవాని ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహిళలతో చెముడులంక గ్రామ వీధులు పసుపుమయంగా మారాయి. మహిళల సందడి, నాయకులు, కార్యకర్తల ఉత్సాహంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ప్రచార కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చెముడులంక గ్రామంలో మహిళల భారీ సందడి మధ్య సాగిన ఈ ప్రచార కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో చెముడులంక కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA