Kadiyam: కడియంలో తుఫాన్ల బీభత్సం 4 వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంటలు!
Kadiyam: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో వరుస తుఫాన్ల ధాటికి తీవ్రంగా నష్టపోయిన వరి రైతులు. 4,000 ఎకరాల్లో నేలవాలిన పంటలు.
Kadiyam: కడియంలో తుఫాన్ల బీభత్సం 4 వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంటలు!
Kadiyam: వరుస తుఫాన్లు వరి రైతుల పుట్టి ముంచుతున్నాయి. బియ్యం ధరలు పైపైకి వెళ్తున్నా ధాన్యం ధరలు కిందనే ఉన్నాయి. అయినా వ్యవసాయానికి అలవాటు పడిన ప్రాణాలు మన రైతులు. కష్టమైనా నష్టమైనా వరి సాగుకు ముందుకు వస్తున్నారు. తాజా తుఫాన్లు వారి ఆశలపై నీళ్లు చల్లాయి.అర్ణబ్ తుఫాను ప్రభావంతో భారీగా నష్టపోయిన రైతులకు ఇప్పుడు మురాసు వర్షాలు శాపంగా మారాయి.
ఈదురు గాలులతో కూడిన అర్ణబ్ తుఫాన్ తో వరి చేలన్నీ నేలన పడకే సాయి. ధాన్యం కంకులు ఇప్పుడిప్పుడే పాలతో గింజలు కడుతుండగా , మురాసు తో కురుస్తున్న వర్షాలతో ముంపుకు గురై వరి చేలు పూర్తిగా కుళ్ళిపోయే పరిస్థితికి చేరువయ్యాయి.మురుగు నీరు వ్యవస్థ సరిగ్గా లేని కడియం ఆవ ప్రాంతం తో పాటు మండలం మొత్తం సుమారు 5400 ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు.
అర్ణబ్ తుఫాన్ దెబ్బకు సుమారు 4000 ఎకరాలు వరి పొలాలు నేలవాలి పంట దెబ్బతిన్నట్లు గా వ్యవసాయాధికారులు నివేదికలు సిద్ధం చేసారు.ఊపిరి పీల్చుకున్న రైతులు ఎంతోకొంత పంట చేతికొస్తుందని , ఆపై ప్రభుత్వ సాయంకుడా తోడవుతుందని కన్నీరు దిగమింగుకున్న రైతును , ఒక్క సారిగా ముంచుకొచ్చిన మురాసు నిండా ముంచేసింది.
ప్రతి ఎకరాకు సుమారు 35 వేలురూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతు వరి కంకు కూడా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. మరోమారు వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, పూర్తి స్థాయి పంట నష్టం నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు.
అలాగే భవిష్యత్ లో రైతు పంట పెట్టుబడి పై నూరు శాతం ఇన్సూరెన్స్ అందేలా ప్రభుత్వం కృషి చేయాలని , చేదోడు, వాదోడుగా నిలవాలని రైతులంతా ముక్త కంఠంతో కోరుతున్నారు.




