Amalapuram: కలెక్టరేట్‌లో ఘనంగా మహాకవి గురజాడ జయంతి వేడుకలు!

Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్‌లో ఘనంగా గురజాడ వెంకట అప్పారావు జయంతి. పాల్గొన్న డిఆర్ఓ వి. సుబ్బారావు మరియు అధికారులు.

SURESH, AMALAPURAM
Published on: 21 Sept 2026 2:51 PM IST
Amalapuram
X

Amalapuram: కలెక్టరేట్‌లో ఘనంగా మహాకవి గురజాడ జయంతి వేడుకలు!

Amalapuram: గురజాడ అప్పారావు సాహిత్య సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి వి సుబ్బారావు తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో తెలుగు సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన మహాకవి,సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు,తన రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని కల్పించారని అధికారులు పేర్కొన్నారు.‘కన్యాశుల్కం’ నాటకం ద్వారా సమాజంలోని మూఢాచారాలు,సామాజిక దురాచారాలపై తనదైన శైలిలో ప్రశ్నించిన ఆయన రచనలు నేటికీ సమాజానికి స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు.

‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అనే సందేశం ద్వారా దేశభక్తి, మానవతా విలువలను ప్రజల్లో పెంపొందించిన గురజాడ తెలుగు భాషాభివృద్ధికి, సామాజిక సంస్కరణలకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు.

గురజాడ అప్పారావు ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఆయన సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేయడం ద్వారా సామాజిక బాధ్యత,మానవతా విలువలను పెంపొందించుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిపాలన అధికారి కె. నాగలక్ష్మమ్మ,జిల్లా విద్యాశాఖ అధికారి మెహబూబ్ భాష,జిల్లా వైద్య శాఖ అధికారి ఎం.దుర్గారావు,జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి అన్వఆర్ తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM