Gokavaram: గోకవరంలో శివయ్య విగ్రహ ప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Gokavaram: గోకవరం రామలింగేశ్వరస్వామి ఆలయ కోనేటిలో పట్నాల సూర్యప్రకాశరావు దంపతులు నిర్మించిన శివ విగ్రహాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 11 Nov 2026 4:05 PM IST
Gokavaram
X

Gokavaram: గోకవరంలో శివయ్య విగ్రహ ప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

గోకవరం: గోకవరం గ్రామంలోని పురాతన శ్రీ పార్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయం నందు గల కోనేరులో శివుని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ స్వయంగా శివయ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఉదయం 8:00 గంటలకు హోమంతో ప్రారంభమైన కార్యక్రమం, ఉదయం 10:14 గంటలకు శివ విగ్రహ ప్రతిష్ఠతో పూర్తయింది. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా పట్నాల సూర్యప్రకాశరావు మాట్లాడుతూ...

"నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీ.శే. పట్నాల పాపారావు, పట్నాల ప్రభావతి, పట్నాల పద్మావతి గార్ల జ్ఞాపకార్థం... కోనేటిలో వారధి నిర్మించి శివ విగ్రహ ప్రతిష్ఠ చేసే అవకాశం నాకు ఇచ్చిన ఆ శివయ్యకు మనసారా నమస్కరిస్తున్నా. ఈ మహోత్సవానికి విచ్చేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి, గోకవరం గ్రామ ప్రజలకు, భక్తులకు కృతజ్ఞతలు" అని తెలిపారు.

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ... "తల్లిదండ్రుల పేరుతో ఇంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టిన సూర్యప్రకాశరావు, రమా నాగలక్ష్మి దంపతులకు అభినందనలు. గోకవరం గ్రామానికి, నియోజకవర్గ ప్రజలందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్నాల సూర్యప్రకాశరావు, రమా నాగలక్ష్మి దంపతులు, వారి కుమారుడు పట్నాల నాగేంద్ర, గోకవరం గ్రామ ప్రజలు, భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM