Kadiyam: కడియంలో ఘనంగా 27వ గణపతి నవరాత్రుల అన్నసమారాధన!
Kadiyam: కడియం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద 27వ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా అన్నసమారాధన. 15 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ.
Kadiyam: కడియంలో ఘనంగా 27వ గణపతి నవరాత్రుల అన్నసమారాధన!
Kadiyam: మండల కేంద్రమైన కడియం వెంకటసూర్య థియేటర్ సమీపంలో వేంచేసియున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద 27 వ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా తాడాల వీర వెంకట్రావు గురుస్వామి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా అన్నసమారాధన నిర్వహించారు.
వివిధ రకాల ఆహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ఈ అన్నసమారాధనకు సుమారుగా 15 వేల మంది భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకుని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. యువకులు, మహిళలు, భవాని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నసమారాధన ఏర్పాట్లలో తమ వంతు సేవలు అందించారు.
దాతలు, భక్తులు, గ్రామస్తుల సహకారంతో నిర్వహించిన ఈ అన్న సమారాధన విజయవంతంగా ముగిసింది. ఈకార్యక్రమంలో కడియం మాజీ ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, టిడిపి మండల అధ్యక్షులు వెలుగుబంటి నాని, వైసిపి జిల్లా జనరల్ సెక్రటరీ ప్రముఖ దాత తాడాల విష్ణు చక్రవర్తి, పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, నర్సరీ రైతులు, కడియం ప్రెస్ క్లబ్ పాత్రికేయులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




