Ravulapalem: గోపాలపురంలో తుఫాను బాధితులకు ఆకుల రామకృష్ణ సాయం!
Ravulapalem: గోపాలపురంలో ఆర్నబ్ తుఫాను బాధితులకు పునరావాసం కల్పించినట్లు ఆకుల రామకృష్ణ తెలిపారు. వారికి ఆహారం, వసతి అందిస్తూ చెట్ల తొలగింపును పర్యవేక్షించారు.
Ravulapalem: గోపాలపురంలో తుఫాను బాధితులకు ఆకుల రామకృష్ణ సాయం!
Ravulapalem: రావులపాలెం మండలం, గోపాలపురం గ్రామంలో బుధవారం అర్ణబ్ తుఫాను బీభత్సం కారణంగా ఇల్లులు, నివాసాలు దెబ్బతిని, కోల్పోయిన బాధిత కుటుంబాలకు గోపాలపురం జిల్లా పరిషత్ హై స్కూల్ లో పునరావసం కల్పించి, టిఫిన్ లు, భోజనాలు ఏర్పాటు చేసి, దగ్గరుండి పర్యవేక్షించిన రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి, ఉద్యమనేత ఆకుల రామకృష్ణ.
గోపాలపురం గ్రామంలో తుఫాన్ కారణంగా రోడ్లకు అడ్డంగా పడిపోయిన చెట్లను, కరెంటు స్తంభాలను ఆకుల రామకృష్ణ దగ్గరుండి ప్రక్కకు తొలగించి, మార్గం సుగమనంచేసి, ఇల్లులు, పూరి గుడిసెలు, పడిపోయి, ఆశ్రయం కోల్పోయినలోతట్టు ప్రాంత ప్రజలు, తుఫాన్ బాధితులు తక్షణం పునరావస కేంద్రాలకు తరలి రావాలని, అందరికీ , తిండి, బస తదితర తగిన ఏర్పాట్లు చేశామని ఆకుల రామకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు . హక్కుల రామకృష్ణ మాట్లాడుతూ, తుఫాన్ లో నష్టపోయిన ప్రజలకు , వ్యవసాయదారులకు అధికారులు తక్షణ స్పందించి, పంట నష్టాన్ని అంచనా వేసి , నష్టపరిహారం చెల్లించాలని రామకృష్ణ తెలియజేశారు.




