Tatipaka: తాటిపాకలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
Tatipaka: రాజోలు మండలం తాటిపాకలో కూటమి శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య పంపిణీ చేశారు.
Tatipaka: తాటిపాకలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
Tatipaka: పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అండగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు.
రాజోలు మండలం తాటిపాక గ్రామంలోని పిల్లివారి గ్రూపులో కూటమి శ్రేణులతో కలిసి నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, గ్రామంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాటిపాక మార్కెట్ కమిటీ చైర్మన్ కేతా వెంకటలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షురాలు అనుచూరి సునీత రామ పురుషోత్తం,మాజీ సర్పంచ్ కోటిపల్లి రత్నమాల, గ్రామశాఖ అధ్యక్షులు నల్లా పరంకుశరావు, ప్రధాన కార్యదర్శి కట్టా సూరిబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ పిల్లి శ్రీరామ్మూర్తి, తెలుగుయువత అధ్యక్షులు చిట్టూరి సంతోష్ (కిట్టు)తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




