Rajahmundry: మంత్రి నారా లోకేష్‌ను కలిసిన గొల్లపల్లి అమూల్య!

Rajahmundry: రాజమండ్రి విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అంశాలపై చర్చించిన టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య.

PRABHU, RAZOLE
Published on: 20 Sept 2026 12:55 PM IST
Rajahmundry
X

Rajahmundry: మంత్రి నారా లోకేష్‌ను కలిసిన గొల్లపల్లి అమూల్య!

Rajahmundry: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదివారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్‌ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు రాజకీయ, సంస్థాగత అంశాలపై మంత్రి నారా లోకేష్‌తో అమూల్య చర్చించినట్లు తెలిపారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పార్టీ కార్యకలాపాల పురోగతి, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై మంత్రి లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణుల సన్నద్ధత, సంస్థాగతంగా చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సూచనలు చేసినట్లు అమూల్య వెల్లడించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE