Gokavaram: గోకవరం గ్రామ అభివృద్ధే నా ప్రధాన ధ్యేయం: కంబాల శ్రీనివాసరావు!
Gokavaram: గోకవరం అభివృద్ధే తన ధ్యేయమని బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు గురువారం సర్పంచ్ అభ్యర్థి పదిలం కనక వరలక్ష్మితో కలిసి ప్రచారం చేశారు.
Gokavaram: గోకవరం గ్రామ అభివృద్ధే నా ప్రధాన ధ్యేయం: కంబాల శ్రీనివాసరావు!
గోకవరం: గోకవరం గ్రామ అభివృద్దే నా ప్రధాన ధ్యేయమని, విశ్వహిందూ దర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు అన్నారు. గోకవరం గ్రామ అభివృద్ధికి, మంచం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిని పదిలం కనక వరలక్ష్మి మురళిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, గురువారం గోకవరం సర్పంచ్ అభ్యర్థిని పదిలం కనక వరలక్ష్మి మురళితో కలిసి, కంబాల శ్రీనివాసరావు గోకవరంలోని పలు వార్డు, విధుల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు.
ప్రతి వీధిలో కూడా అడుగడుగునా ఆయనకు మహిళలు, ప్రజలు హరతులతో స్వాగతం పలుకుతూ నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు నిత్యం సేవ చేసే గ్రామాభివృద్ధిని కోరుకునే మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం మూడు నియోజకవర్గాల్లో కోట్ల రూపాయలు సొంత డబ్బలు ఖర్చుపెట్టి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు.
ప్రతి నెల ఏ ఆధారం లేని అభాగ్యులకు ఉచిత బియ్యం, విద్య, వైద్య ఆర్థికపరంగా అనేకమంది పేదలకు సేవ చేస్తున్నారన్నారు. అటువంటిది తన సొంత గ్రామమైన గోకవరం గ్రామాన్ని ఇంకా ఎంత అభివృద్ధి చేస్తానో ప్రజలు గుర్తించాలన్నారు. గోకవరం సర్పంచ్ గా పదిలం కనకలక్ష్మిని, అలాగే వార్డు అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపిస్తే, గోకవరం గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
బెదిరింపులు, ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓటు వేసి ఊరికి ఉపకారం చేసే కంబాల శ్రీనివాసరావు బలపరిచిన, పదిలం కనకలక్ష్మిని సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలు, రామసేన సభ్యులు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




