Gokavaram: గోకవరం మండలంలో ఘనంగా గాంధీ జయంతి!

Gokavaram: గోకవరం మండలంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనసేన నాయకులు.

NARAYANA, RAJANAGARAM
Published on: 2 Oct 2026 1:50 PM IST
Gokavaram
X

Gokavaram: గోకవరం మండలంలో ఘనంగా గాంధీ జయంతి!

Gokavaram: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గోకవరం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పదిలం మురళి కృష్ణ , దోసపాటి సుబ్బారావు, నక్క రామరాజు, మైపాల్ పాండురాజు, మైపాల్ శివాజీ తదితరులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి అందించిన సేవలను, అహింసా సిద్ధాంతాన్ని నాయకులు స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు పేర్కొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM