Gokavaram: స్థానిక ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

Gokavaram: గోకవరం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.

NARAYANA, RAJANAGARAM
Published on: 3 Oct 2026 8:39 PM IST
Gokavaram
X

Gokavaram: స్థానిక ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

గోకవరం: జగ్గంపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గోకవరం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడంతో పాటు పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారిని గుర్తించి, వారిని ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మండల నాయకులు తెలిపారు.

రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న నాయకులు, కార్యకర్తలను ప్రోత్సహించడం, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

మండలంలోని జనసేన నాయకులు, కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేసి రాబోయే ఎన్నికలకు సమష్టిగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండలలో ఉన్నా జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM