Gokavaram: అమరవీరుడు పి. శ్రీనివాస్‌కు ఘన నివాళి: గోకవరంలో ర్యాలీ!
Gokavaram: కీర్తి చక్ర గ్రహీత, దివంగత ఐఎఫ్ఎస్ అధికారి పందిళ్ళపల్లి శ్రీనివాస్ 35వ వర్ధంతిని తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ర్యాలీ చేపట్టారు.
Gokavaram: అమరవీరుడు పి. శ్రీనివాస్‌కు ఘన నివాళి: గోకవరంలో ర్యాలీ!
గోకవరం: కీర్తి చక్ర గ్రహీత, అమర వీరుడు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పందిళ్ళపల్లి శ్రీనివాస్ 35వ వర్ధంతిని మంగళవారం గోకవరం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఇందుకూరు రేంజ్ కార్యాలయంలో అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ అధికారి కె. కొండలరావు ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించారు. ముందుగా పందిళ్ళపల్లి శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో అటవీశాఖ సిబ్బంది,స్థానిక ప్రజలు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమర వీరుడు శ్రీనివాస్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ అటవీశాఖ కార్యాలయం నుండి పాత బస్టాండ్ పోలీస్ స్టేషన్ ఆంజనేయస్వామి గుడి సెంటర్ మీదుగా ఠానా వరకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రేంజ్ అధికారి కె కొండలరావు గారు మాట్లాడుతూ పందిళ్ళపల్లి శ్రీనివాస్ అడవి కోసం పుట్టి, అడవి కోసమే ప్రాణాలర్పించారు. వీరప్పన్ లాంటి క్రూరుడిని కూడా లొంగదీసుకోవాలని నిరాయుధుడిగా వెళ్ళిన ధీరుడు. ఆయన త్యాగం ఎప్పటికీ మరువలేనిది. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ ఇందుకూరు సెక్షన్ ఆఫీసర్ రామకోటి మరియు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.




